పశ్చిమ గోదారి జిల్లా నర్సాపురంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపిస్తుండటంతో హడెలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన అక్రమ దందాపై అధికా రులు ఉక్కపాదం మోపడంతో యథేచ్చగా సాగిస్తున్న దందాకు కళ్లెం పడింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. రాజకీయ నేతలు పలుకుబడి, అండదం డలంతో యథేచ్చగా సాగిస్తున్న దందాపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపడంతో బెంబేలెత్తిపోతున్నారు అక్రమార్కులు. 180 మందిపై చర్యలకు సిద్ధమయ్యారంటే ఏ మేర అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే మున్సిపాలిటీలో భవనాలు నిర్మించా లంటే అధికారుల పర్మిషన్ కంపల్‌సరి. అలాంటి అనుమతు లేమీ లేకుండా రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే తీరు సాగింది. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టు మున్సిపాల్ అధికారు లు కొరడా ఝుళిపి స్తున్నారు. అక్రమ కట్టడాలపు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ఒక్కొక్కటిగా అనుమతు లు లేని నిర్మాణాలు బయటపడుతున్నాయి. దీంతో చర్యలకు పూనుకుంటు న్నారు ఆఫీసర్లు.అక్రమ కట్టడా లను అరికట్టేందుకు రంగంలోకి దిగిన మున్సిపాలిటీ అధికారులు 180 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 98 మంది భవన యజమా నులకు కోర్టు నోటీసులను అందించగా 13 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. మరొకరికి లక్షా 78 వేల రూపాయలకుపైగా జరిమానా విధించారు. అయితే పట్టణంలోని ప్రజలందరూ భవన నిర్మాణాలు చేపట్టే ముందు, స్థలాలు కొనే ముందు వాటికి అనుమతులు ఉన్నాయా లేవా? ఆ భవనాలు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా చూసుకొని కొనుగోలు చేసుకో వాలని మునిసిపల్ కమిషనర్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు సూచించారు.