Site icon Swatantra Tv

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం

సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం క్షుణ్ణంగా పరిశీలిం చింది. ఘటనా స్థలంలో సీసీఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తు న్నారు. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. 30 అడుగుల దూరం నుంచి సీఎం జగన్‌పై దుండగుడు దాడి చేశాడు.

ముఖ్యమంత్రి జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభ రేపటికి వాయిదా పడింది. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవా లంటూ సీఎం జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తదుపరి కార్యక్రమాన్ని ఈరోజు విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సీఎం జగన్‌పై దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా సీఎం పర్యటన సాగే ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. రాత్రివేళ నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. భారీ భద్రతావలంలో ఉండే సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమ య్యారో అర్థమవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రొటోకాల్‌ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగడం ఘోర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీ సీరియస్ అయింది. దాడి ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజయవాడ సీపీ కాంతి రాణాకి ఆదేశించింది.

Exit mobile version