Site icon Swatantra Tv

ఆందోళనకరంగా అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.గుండె సంభందిత వ్యాదితో బాధపడుతున్న శ్రీలక్ష్మి.. గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే సీబీఐ విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు పంపించినా.. అవినాష్‌ రెడ్డి తన తల్లితో ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.

ప్రెస్ నోట్ లో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. ఆమె నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్‌ (హార్ట్ అటాక్)కు గురయ్యారని.. అందుకు యాంజియోగ్రామ్ చికిత్స చేశామని తెలిపింది. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలిందని… ప్రస్తుతం సీసీయూలో ఒక ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆమెను ఉంచామని తెలిపింది. ఆమెకు లోబీపీ ఉన్నందున మరికొన్ని రోజులు సీసీయూలో ఉంచాల్సిన అవసరం ఉన్నట్లు అని ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది.

Exit mobile version