Site icon Swatantra Tv

బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితాపై దుమారం

     బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా రెండు మూడు నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీని అంటి పెట్టుకొని ఉన్నవారిని కాదని.. నిన్న, మొన్న చేరిన బీఆర్ఎస్ నేతలకు టికెట్‌లు ఇవ్వడాన్ని కాషాయ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జహీరాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజ్‌గిరి సీట్ల కేటా యింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా.. మల్కాజ్‌గిరి టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సోసల్ మీడియా వేదికగా స్పందించారు. మల్కాజ్‌గిరిలో తన కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ మురళీధర్‌రావు ట్వీట్ చేశారు. త్వరలోనే అనుచరులను, కార్యకర్తలను వ్యక్తగతంగా కలుస్తానని చెప్పారు. ఆపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా అని ఎక్స్ వేదికగా మురళీధర్ రావు పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు బీజేపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.

    తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకే వివాదాస్పదం లేకుండా ఉంటే తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. కీలక మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహ బూబాబాద్ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. మల్కాజ్‌గిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఖరారు చేశారు. అయితే, మల్కాజ్‌గిరి స్థానంపై ఆశలు పెట్టుకున్న మురళీధర్‌రావుకు భంగపాటు తప్పలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది.

Exit mobile version