Site icon Swatantra Tv

పార్టీలకు తలనొప్పిగా మారిన ఎన్నికల ఖర్చు

    గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో ధనప్రవాహం ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. పెరిగిన ఎన్నికల ఖర్చు అన్ని రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ పార్టీలు భావించ డం సహజం. ఇందులో భాగంగా ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచే దుర్మార్గ ప్రక్రియ ప్రారంభమైంది. మనదేశ ఎన్నికల వ్యవస్థలో ధన ప్రవాహం గురించి కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 17వ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రికార్డ్ స్థాయిలో సొమ్ములు చేతులు మారాయని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్నికల వ్యయం రూ.60 వేల కోట్లని తేలింది. 2014 ఎన్నికల ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు.

    సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధ్యయనంలో ఏ రాజకీయ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే విషయాలు కూడా వెల్లడ య్యాయి. ఈ మొత్తం ఖర్చులో బీజేపీదే అధిక మొత్తం అని తేలింది. బీజేపీ ఎన్నికల వ్యయం 45 శాతం కాగా, కాంగ్రెస్ వాటా 40 శాతమని తేలింది. పార్టీలన్నీ కలిపి ఒక్కో ఓటరుపై రూ. 700లు ఖర్చు చేసివ్యయం చేశాయి. 1998 – 2019 మధ్య ఎన్నికల ఖర్చు ఆరు రెట్లు పెరగడం విశేషం. 1998లో రూ.9 వేల కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం అది దాదాపు 60 వేల కోట్లకు చేరుకుంది. 1998లో ఎన్నికల ఖర్చులో బీజేపీ 20 శాతం ఖర్చు చేసింది. 2019లో అది 45 శాతానికి చేరు కుంది.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఎన్నికల్లో డబ్బు ప్రభావం అసలు ఉండేది కాదు. ఉన్నా, నామ మాత్రం గా ఉండేవి. అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో ఏ వాహనాన్ని తనిఖీ చేసినా, పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నోట్ల కట్టల బాగోతం వెలుగుచూస్తోంది.

   ఎన్నికల్లో పోటీ అంటేనే డబ్బు సంచులతో పని అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. డబ్బులు లేని వారు అసలు ఎన్నికల్లో పోటీ అంశాన్ని కలలో కూడా ఊహించలేకపోతున్నారు. సొమ్ములు న్నవారికే రాజకీయాలు ఎన్నికల్లో పోటీ అనే అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయింది. బరిలో ఉన్న అభ్యర్థి ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నెలకొంది. టికెట్లు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీల వైఖరి కూడా మారింది. గతంలో టికెట్ ఆశించే వ్యక్తికి ప్రజల్లో ఉన్న పరపతి, వ్యక్తిగత ఇమేజ్‌, సమస్యల పరిష్కారంలో సామర్థ్యం ఇవే ప్రామాణికంగా ఉండేవి. అయితే అదంతా ప్రాక్టికల్‌ గా గతంలా మారింది.

    ప్రస్తుతం మనదేశంలో రాజకీయాల స్వరూపమే మారిపోయింది. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టగలిగేవా ళ్లకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ఆర్థికంగా బలవంతుడైన ప్రత్యర్థిపై సొమ్ములు ఖర్చు పెట్టలేని వాళ్లను ఎలా నిలబెడతాం అని ప్రశ్నిస్తున్నారు రాజకీయపార్టీల అధినేతలు. దీంతో టికెట్ ఆశించేవాళ్లను విడివిడిగా పిలిపించి, ఎంత ఖర్చు పెట్టగలవు అని సూటిగా ప్రశ్నించే దుర్మార్గమైన సంప్రదాయం రాజకీయాల్లో మొదలైంది. ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లి గలిగినవారికే టికెట్లు దొరకడం సర్వసాధారణంగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఆ తరువాత అదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపునకు అయిన ఖర్చును రాబట్టు కోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా అవసరమైన సొమ్ములను సంపాదించుకోవడంలో రాజకీయ నేతలు బిజీ అయిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూసి అసలు దేశంలో ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎటువంటి చట్టాలు లేవన్న అభిప్రాయానికి వస్తున్నారు. అయితే ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఎన్నికల ఖర్చుకు సంబంధించి మనదేశంలో కఠినమైన చట్టాలే ఉన్నాయి. ఎన్నికల ఖర్చు ఎంతయింది అనే విషయాన్ని అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే అఫిడవిట్ లో రాజకీయ నేతలెవరూ అసలు ఖర్చు చూపించడం లేదు. తూతూ మంత్రంగా అంకెలు వేసి మమ అనిపిస్తున్నారు. దీంతో చట్టాన్ని కూడా రాజకీయ నేతలు ఉల్లంఘిస్తు న్నారు.ఎన్నికల ఖర్చు పై ఎన్నికల కమిషన్ గట్టి నిఘాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటు న్నారు ప్రజాస్వామ్యవాదులు.

Exit mobile version