కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి 2024 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం మరోసారి పెద్దపీట వేసింది. ఈ సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వ 9 ప్రాధామ్యాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల హైలైట్ చేశారు. స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల కోట్లతో 4.1 కోట్లమంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. అలాగే విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.