Site icon Swatantra Tv

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది. తీవ్ర తుఫాన్‌గా మారిన రెమాల్‌ తుఫాను అర్ధ రాత్రి సమయంలో బెంగాల్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 నుండి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తర ఒడిశా, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Exit mobile version