Site icon Swatantra Tv

నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో ఉద్రిక్తత

   నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న భూతగాదాలతో సంజప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంజప్ప హత్య నేపథ్యంలో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇవాళ సంజప్ప అంత్యక్రియలతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించ డంలో నిర్లక్ష్యం వహించిన ఊట్కూరు ఎస్సై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్సై శ్రీనివాసులను సస్పెండ్‌ చేస్తు న్నట్లు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు.

Exit mobile version