హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు. ముట్టడికి వెళుతుండగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ వద్ద కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. AITUC పిలుపు మేరకు సింగరేణిని ప్రైవేటికరణ, వేలం వేయొద్దు అంటూ.. తెలంగాణ బొగ్గు – సింగరేణి హక్కు అనే నినాదాలతో రాజ్ భవన్ ముట్టడి వెళ్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేవరకు పోరాడతామని హెచ్చరించారు.