Site icon Swatantra Tv

పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ – కేటీఆర్

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం రయ్‌ రయ్‌మని ఉరికిందని, కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై.. అంటున్నదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. KCR పాలనలో రియల్‌ భూమ్‌ ఎలా ఉండేదని, కాంగ్రెస్‌ పాలనలో ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. కేవలం పరిపాలన దక్షత లోపం, విజన్‌ లేని పాలనా విధానంతోనే ఆదాయం పడిపోయిందని చెప్పారు. హైడ్రాతో తెలంగాణ ఆదాయానికి జీవధార అయిన రియల్‌ రంగంపై వేటు పడిందని, ముందు చూపులేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పడిందని కేటీఆర్ విమర్శించారు.

Exit mobile version