28.2 C
Hyderabad
Monday, June 5, 2023

‘ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు?’… కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వై.వైస్. షర్మిల

YS Sharmila| అధికార బీఆర్ఎస్ పై మరొక్కసారి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల నిప్పులు చెరిగారు. ట్విట్టర్ లో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతూ… “నిన్నటి వరకు తెలంగాణ మా తాతల జాగీరు.. నేను తెలంగాణ ముద్దుబిడ్డను.. నాకు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎవరికి లేదు అని చెప్పుకొన్న దొర గారికి.. దేశాన్ని దోచుకోవాలని కల పడగానే.. దేశ పౌరున్ని అనే సంగతి గుర్తుకువచ్చింది.. దేశ రాజకీయాలు చేయడం గుర్తుకువచ్చింది.” అంటూ విరుచుకుపడ్డారు.

‘అయ్యా దొర.. మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా మాట్లాడింది..లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే, ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంది. మరి ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు? ఏం సంజాయిషీ ఇచ్చుకొంటావు? ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు? నేను తెలంగాణ కోడలినైనప్పటికీ నన్ను ఆంధ్రా ద్రోహి అని మీ పార్టీ వాళ్లు అవహేళన చేసినప్పుడు.. మీకు నేను ఇక్కడి కోడలినని, ఈ దేశ పౌరురాలినని గుర్తుకురాలేదా? మీకు చెప్పడానికి నోరు రాలేదా? నరం లేని నాలుక వంద అబద్దాలు చెబుతుందన్నట్లు మన దగ్గరికి వస్తే ఒక న్యాయం, మందికైతే ఒక న్యాయమా?’ అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల నిప్పుల వర్షం కురిపించారు.

Latest Articles

పామును నోటితో కొరికి చంపిన బాలుడు

స్వతంత్ర, వెబ్ డెస్క్: పామును ఓ బాలుడు నోటితో కొరికి చంపేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరూఖాబాద్‌ జిల్లాలోని మద్నాపుర్‌ గ్రామంలో దినేశ్‌సింగ్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్