32.5 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రేమించిన యువకుడి చేతిలోనే తెలంగాణ యువతి హత్యకు గురైంది. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్(23), ఢిల్లీకి చెందిన అర్పిత్ అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి బెంగళూరు కోడిహళ్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే ఇద్దరం వేర్వేరుగా ఉందామని ఆకాంక్ష ప్రియుడికి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సోమవారం రాత్రి కూడా మరోసారి గొడవ జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన అర్పిత్ యువతి మెడకు చున్నీ చుట్టి ఊపిరి ఆడకుండా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మైదుకూరు వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నామినేషన్ కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవులతో కలిసి స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్