స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివసిస్తున్నారు. అదే అపార్ట్మెంట్ లో డింపుల్ హయతి అతని ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్ తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఈ నెల 14న డింపుల్ హైయతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డీసీపీ కారు ముందు భాగం దెబ్బతింది. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్ హయతి, ఆమె స్నేహితుడు డేవిడ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. డింపుల్ హైయతి, డేవిడ్లను పోలీస్ స్టేషన్‌కు పిలిచి నోటీసులు ఇచ్చి పంపించివేశారు.