తెలంగాణ: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి.. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ‘నిరుద్యోగ నిరసన’కు దిగనున్నారు. నిరుద్యోగులకు భరోసా నిస్తూ.. ‘చావులొద్దు, సత్తా చూపుదాం’ అనే నినాదంతో దీక్ష చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమౌతోంది.