Site icon Swatantra Tv

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం కొత్త తేదీ ఖరారు

New Secretariat

New Secretariat Inauguration: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కోంది. సీఎం కేసీఆర్(KCR) చేతుల మీదుగా కొత్త సచివాలయం ప్రారంభంకానుంది. నూతన సచివాలయానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంగా పేరు పెట్టారు. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడింది. రూ.610 కోట్ల వ్యవయంతో నిర్మాణం చేపట్టిన నూతన సచివాలయానికి జూన్ 27,2019న కేసీఆర్ భూమి పూజ చేశారు. ఇక తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం జూన్2న ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మాణం జరిగింది. మొత్తం 11.45లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మాణం చేపట్టారు.

Read Also: ‘మహిళా గోస – బీజేపీ భరోసా’ పేరుతో బండి సంజయ్ దీక్ష
Follow us on:   Youtube   Instagram
Exit mobile version