Site icon Swatantra Tv

డీఎస్సీ 2008 సెలెక్టెడ్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

తెలంగాణలో 2008 DSC అభ్య‌ర్థుల‌ 16 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఎన్నో ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు, విన్న‌పాల త‌ర్వాత.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2008 DSC అభ్య‌ర్థుల‌కు తీపి క‌బురు అందించింది. 2008 DSC BED అభ్య‌ర్థుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో రిక్రూట్ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. దీంతో త‌మ పోరాటానికి ఫ‌లితం ద‌క్కింద‌ని అభ్యర్థులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్ నిర్ణ‌యం మేర‌కు 2008 DSCలో 30 శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన BED అభ్య‌ర్థుల వివ‌రాల‌ను పాఠ‌శాల విద్యాశాఖ నుంచి స‌ర్కార్ సేక‌రించింది. హైద‌రాబాద్ మిన‌హా ఇత‌ర జిల్లాల్లో ప‌ని చేసేందుకు 2008 DSC BED అభ్య‌ర్థుల‌ను విధుల్లోకి తీసుకోనున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థుల‌కు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో రిక్రూట్‌మెంట్‌పై ప్ర‌భుత్వం స‌మాచారం చేర‌వేసింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు పాఠ‌శాల విద్య అధికారిక వెబ్‌సైట్‌లో క‌న్సెంట్, వెరిఫికేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల‌కు సెప్టెంబ‌ర్ 27 నుంచి అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు ఆయా జిల్లాల్లో DEOల ఆధ్వ‌ర్యంలో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ జ‌ర‌గ‌నుంది.

Exit mobile version