Site icon Swatantra Tv

ఏసీబీ వలలో చిక్కిన తహశీల్దార్‌

    కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట తహశీల్దార్‌ మార్తల రజిని ని అరెస్టు చేసారు ఏసీబీ అధికారులు. తహశీల్దార్‌ అక్రమా స్తులపై సోదాలు నిర్వహించిన అధికారులు మూడు కోట్ల 21 లక్షల రూపాయల విలువగల ఆస్తుల్ని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 12 కోట్లుగా ఉంటుందని అంచనా. హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు సన్నిహి తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు ఆమెకు సంబంధించి రెండు బ్యాంకు లాకర్లను తెరిచారు. 22 ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలతోపాటు బ్యాంకు ఖాతాలో 25 లక్షల రూపాయల నగదును గుర్తించారు. కిలోన్నర బంగారు ఆభరణాలు, లక్షా 50వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version