MLC Election |ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి.. ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాల భర్తీకి ఎన్నికలు జరగ్గా.. ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడటంతో ఎన్నిక అనివార్యమైంది. ఓ సభ్యుడు గెలవడానికి 23 ఓట్లు అవసరం కాగా.. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.
MLC Election |టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో విశాఖ జిల్లాకు చెందిన వాసుపల్లి గణేష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, చీరాల శాసనసభ్యులు కరణం బలరాం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీపై అసమ్మతి ప్రకటించారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసినప్పటికి.. టీడీపీ అభ్యర్థి గెలుపు కష్టమే. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి గెలవడంతో అసలేం జరిగిందనే చర్చ మొదలైంది. టిడిపి నుంచి గెలిచిన వారంతా ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేశారా.. లేదా వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అనే చర్చ సాగుతోంది.
Read Also: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
Follow us on: Youtube Instagram