Site icon Swatantra Tv

సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ ఈ రాష్ట్ర అధినేతను మాత్రం కలవలేమని వ్యాఖ్యానించారు. అందుకే ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరదూరంగా ఉంటున్నాయని తెలిపారు. అంతేకాకుండా కొంతమంది నేతలు మాటలు చెబుతారే కానీ పని చేయరని పరోక్ష విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే ఒక్క ఫ్యామిలీ మాత్రమే బాగుపడడం కాదని రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళిసై వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు.

Exit mobile version