Site icon Swatantra Tv

నేడు ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్

   టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ భారత్, పాకిస్థాన్‌ మధ్య గ్రూప్‌- ఎ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ రెండు జట్లకూ కీలక కానుంది. ఐర్లాండ్‌పై గెలిచి బోణీ కొట్టిన టీమ్‌ఇండియా.. పాక్‌పై నెగ్గి సూపర్‌- 8కు చేరువ కావాలని చూస్తోంది. ఇక, పాక్‌ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్‌ ఓవర్లో అనూహ్య పరాభ వాన్ని మూటగట్టుకుంది. పాకిస్థాన్‌ బౌలర్లు, టీమ్‌ఇండియా బ్యాటర్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. పిచ్‌ కూడా పేసర్లకు సహకరించేదే కావడంతో షహీన్‌ షా అఫ్రిది, నసీం షా, హారిస్‌ రవూఫ్, మహమ్మద్‌ అమీర్‌తో ప్రత్యర్థి పేస్‌ దళం సిద్ధ మైంది. అయితే, భారత్‌కు అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఓపెనర్లు రోహిత్, కోహ్లితో పాటు పంత్, సూర్యకుమార్, శివమ్‌ దూబె, హార్దిక్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. ఐర్లాండ్‌పై అర్ధశతకం చేసిన రోహిత్, పంత్‌తో పాటు కోహ్లి, సూర్యకుమార్‌ లాంటి వారు ఉన్నారు. దాంతో భారత్‌ పరుగుల వేట కొనసాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియాదే మెరుగైన రికార్డు. ఇప్పటివరకూ ఈ పొట్టికప్‌ల్లో దాయాదితో 7 మ్యాచ్‌లాడగా కేవలం ఒక్కదాంట్లోనే భారత్‌ ఓడింది.

Exit mobile version