Site icon Swatantra Tv

Suriya |తండ్రితో సూర్యకు గొడవ.. ముంబైకి మకాం?

Suriya

తమిళ హీరో సూర్య(Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు సూర్య. అయితే తాజాగా సూర్య కుటుంబం నుంచి ఓ వార్త కోలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. అదేటంటే సూర్య తన తండ్రి శివకుమార్(Shivakumar)తో గొడవపడి చెన్నైలోని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడట. ఈ విషయాన్ని తమిళ నటుడు బైలవ్వన్ రంగనాథన్(Bayilvan Ranganathan)ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

2006లో సూర్య, హీరోయిన్ జ్యోతిక(Jyothika)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తన ప్రేమ గురించి తండ్రితో చెప్పినప్పుడు జ్యోతిక సినిమాల్లో నటించనంటే పెళ్లికి ఒప్పుకుంటానని షరతు పెట్టడంతో ఆ ఒప్పందంతోనే వీరి పెళ్లి జరిగింది. పిల్లలు పెద్దవడంతో ఇటీవల జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఆమె మళ్లీ నటించడం సూర్య తండ్రికి నచ్చడం లేదట. దీంతో వివాదాలు మొదలై సూర్య ఇంటి నుంచి బయటకు వచ్చి ముంబైలో ఇల్లు తీసుకుని అక్కడ ఉంటున్నాడట. హీరో కార్తీ(Karthi) కూడా తన తండ్రికే మద్దతుగా నిలిచాడట. ప్రస్తుతం రంగనాథన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: కాబోయే భార్య అంటూ ఫోటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌.. లగ్గం ఎప్పుడంటే..

Follow us on:   Youtube   Instagram

Exit mobile version