Site icon Swatantra Tv

Election Commission |ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాతపద్ధతికి గుడ్‌బై.. ఇలా చేయాల్సిందేనన్న సుప్రీం..

Election Commission |ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఎలక్షన్‌ కమిషనర్ల నియమాకంలో పాత పద్ధతికి గుడ్ బై చెబుతూ.. వారి నియామకానికి మార్గదర్శకాలు జారీచేసింది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న విధానం రద్దయింది. ఎన్నికల కమిషన్‌ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజేఐ, విపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు పార్లమెంట్లో సైతం చట్టం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ప్రధాన మంత్రి , లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు , సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన కమిటీ తో ఎన్నికల కమిషనర్లు నియామకం చేపట్టనున్నారు.

ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తప్పుపట్టింది. ఈసీ(Election Commission) నియామకానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వమే ఎన్నికల కమిషనర్లను నియమిస్తుండగా.. దీనిపై కొంతకాలంగా వివాదం నెలకొంది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన దర్మాసనం ఎన్నికల కమిషనర్ల నియమాకానికి సంబంధించి తీసుకోవల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీచేసింది.

Read Also: ఈసారి జనసేన ఆవిర్భావ సభ అక్కడే.. వారాహితో ఎంట్రీ ఇవ్వనున్న పవర్‌స్టార్‌

 Follow us on: Youtube

Exit mobile version