Site icon Swatantra Tv

కేటీఆర్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు తిరస్కరించింది. దీనిపై వెంటనే విచారణ చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. వచ్చే బుధవారం విచారిస్తామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది

మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రేసు నిర్వహణకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్‌ నేతను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అర్వింద్‌ కుమార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌, రికార్డ్‌ చేసిన అంశాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో కేటీఆర్‌ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

Exit mobile version