Site icon Swatantra Tv

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు వేగంగా జరగడం లేదని.. దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. హత్యకు గల కారణాలు, ఉద్దేశాలను బయటపెట్టాలని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారిని మార్చండి.. లేదంటే మరో అధికారిని నియమించండి.. అవసరమైతే ప్రస్తుతం ఉన్న అధికారినే కొనసాగించండి.. ఏదైనా కానీ దర్యాప్తు వేగంగా పూర్తి చేయండని ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక మొత్తం చదివామని.. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని నివేదికలో రాశారని పేర్కొంది. సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Exit mobile version