Site icon Swatantra Tv

అవినాష్ రెడ్డి తల్లికి శస్త్రచికిత్స జరగలేదు: సునీత రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యా కేసులో సీబీఐ ఆరోపణలు ఎదుర్కొటున్న అవినాష్ రెడ్డికి నిన్న తెలంగాణ హై కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ మంజూరు చేయడం సరికాదని.. దీనికోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని వివేకా కూతురు సునీత తెలిపారు. అయితే సునీత మరొక్క వాదనను సైతం వినిపిస్తున్నారు. అవినాష్ రెడ్డి.. తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు. తన తల్లికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది ఇచ్చిన హామీతో తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా అరెస్టు చేయరాదంటూ కోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రకటన తప్పయితే చర్యలు తప్పవని పేర్కొందన్నారు.

మీడియా కథనాల ప్రకారం ఆమెకు శస్త్రచికిత్స జరగలేదని తెలిసిందన్నారు. శస్త్రచికిత్స జరుగుతోందన్న న్యాయవాది ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి రికార్డులు లేనందున గత ఆదేశాల ప్రకారం అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది స్వేచ్ఛ కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ సంబంధిత రికార్డులు సమర్పించారు కదా అని ప్రశ్నించగా, శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులు లేవని న్యాయవాది తెలిపారు. తమ మెమోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేయగా మెమోను న్యాయమూర్తి తీసుకున్నారు.

Exit mobile version