Site icon Swatantra Tv

సుగుణమ్మ టిడిపికి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం

     తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గంలో రోజురోజుకీ రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. వైసీపీ అభ్యర్థిని ప్రక టించి దూసుకుపోతోంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ భూమున కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మొదట విడుదల చేసిన జాబితాలో టిడిపి కేవలం 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి వారి పేర్లను కూడా ఖరారు చేసింది. జనసేనకు తిరుపతి సీటు కేటా యించాల్సి రావడంతో, అభ్యర్థిపై జనసేన- టీడీపీ డైలమాలో ఉన్నాయి.

     రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు టిడిపి అటు జనసేన, తాజాగా బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన పార్లమెంట్ ఇన్చార్జి నరసింహ యాదవ్ అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను టీడీపీ అధిష్టానం పిలిపించి తిరుపతి టికెట్ ను కూటమిలో భాగంగా జనసేనకు ఇచ్చే లా నిర్ణయం తీసుకు న్నట్టు ఏపీ టిడిపి నాయకుడు అచ్చం నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను జనసేన తీర్థం పుచ్చుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. టిడిపికి, పార్టీ సభ్యత్వా నికి రాజీనామా చేసి సుగుణమ్మ త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

    తిరుపతి నగరంలో జనసేన అభ్యర్థిత్వంపై పలు వ్యాఖ్యలు వినవస్తున్నాయి. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మరోవైపు చిరంజీవి స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన విజయ్ కుమార్, టిడిపి నుంచి కోడూరు బాలసుబ్రమణ్యం, జేబీ శ్రీనివాసులు వంటి ఎవరి పేర్లనూ కూటమి పరిశీలించ లేదు. గత ఎన్నికల్లో కేవలం 825 ఓట్లతో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు తెరమీదకి వచ్చింది. అయితే బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్న తిరుపతి మహానగరంలో సుగుణమ్మకు జనసేన పార్టీ తరపున టికెట్టు మంజూరు అయ్యేటట్లు స్పష్టమవుతోంది. మొదటి నుంచి సుగుణమ్మ టిడిపి తరఫున ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నగర ప్రజలకు సేవలందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైనా సుగుణమ్మ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా టిడిపి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఇప్పుడు సుగుణమ్మ టిడిపికి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున జనసేన నుంచి తిరుపతి బరిలో నిలువనున్నారు. నగర ప్రజలు కూటమిలో భాగంగా సుగు ణమ్మ అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపుతారా అధికార పార్టీ ప్రకటించిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి త్వం వైపు మొగ్గు చూపనున్నారా.. అన్నది సస్పెన్స్. ఎన్నికల నాటికి ఏ మార్పులు జరుగుతాయో.. టీడీపీ రెండో జాబితా ప్రకటన అనంతరం తేటతెల్లం కానుంది. 

Exit mobile version