Site icon Swatantra Tv

నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌లు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 267 పాయింట్ల నష్టంతో 61,481 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 18,181 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Exit mobile version