Site icon Swatantra Tv

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 18.11 పాయింట్లు లాభపడి 61,981.79 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 33.60 పాయింట్లు లాభపడి 18,348.00 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.81గా ఉంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల బాటలో పయనించగా… రిలయన్స్, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Exit mobile version