Site icon Swatantra Tv

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటల సమయంలో సెన్సెక్స్‌ 492 పాయింట్ల లాభంతో 62,993 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 18,628 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పుంజుకొని 82.53 దగ్గర ప్రారంభమైంది. యూఎస్‌ ఫ్యూచర్‌ మార్కెట్లు ప్రస్తుతం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అప్పుల పరిమితి పెంపుపై అధ్యక్షుడు బైడెన్‌, హౌస్‌ స్పీకర్‌ మెకార్థి మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇక మరోవైపు ప్రైవేటు రంగ బ్యాంకుల డైరెక్టర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ నేడు సమావేశం కానున్న నేపథ్యంలో మదుపర్ల దృష్టి అటువైపు ఉండడంతో ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 1 శాతం పెరిగి 78 డాలర్ల ఎగువకు చేరింది.

Exit mobile version