Site icon Swatantra Tv

ఎల్బీనగర్‌లో సందడి చేసిన బుల్లితెర తారలు

హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా సీరియల్ నటులు… తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మా సీరియల్స్ “కృష్ణా ముకుంద మురారి, మామగారు, వంటలక్క మరియు పాపే మా జీవనజ్యోతిలో అలరిస్తున్న నటీనటులు ఎల్పీ నగర్‌లో తమ అభిమానులతో సంతోషంగా గడపటంతో పాటుగా చిరస్మరణీయ క్షణాలను సృష్టించారు. ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ , సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో గడిపారు. తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి, ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడమే తమ ధ్యేయమని.. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్టార్ మా యాజమాన్యం తెలిపింది.

Exit mobile version