AP SSC Exams |ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు ఈనెల ౩వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షా సమయంగా నిర్ణయించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోరన్నారు. మొత్తం 6లక్షల 9వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో 3లక్షల 11 వేల 329 మంది బాలురు, 2 లక్షల 97 వేల 741 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం 3 వేల 349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించబోమని చెప్పారు. ఉదయం పదో తరగతి పరీక్షల(AP SSC Exams) అనంతరం మద్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఈ నెల వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.
Read Also: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా.. ఇలా చేస్తే జాబ్ గ్యారంటీ..
Follow us on: Youtube, Instagram, Google News