Site icon Swatantra Tv

ఏపీలో ఎన్నికల కోడ్‌తో పెరిగిన శ్రీవారి ఆదాయం

     ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ టీటీడీకి కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీవారి భక్తులకు కూడా ఇవి వరంగా మారింది. తిరుమల శ్రీవారి ఆదాయం 25 నెలలుగా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రతి నెలా వంద కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఎన్నికల గెలుపు కోసం వస్తున్న రాజకీయ నేతలతో హుండీ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ ప్రభావం తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఎన్నికల కోడ్ అమలుతో తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్‌కి గడిచిన 15 రోజుల్లో 22వేల 75 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఎన్నికల కోడ్‌తో మార్చి 16 నుంచి సిపార్సు లేఖలు రద్దు చేసిన టీటీడీ.. ప్రత్యామ్నాయం కోసం శ్రీవాణి టికెట్ల కోటాను కూడా పెంచింది. పదివేల డొనేషన్‌ తో వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించడంతో హుండీ ఆదాయం మరింత పెరిగినట్టుగా కూడా చెబుతున్నారు అధికారులు. తిరుమల ఆఫ్‌లైన్‌ కోటా కూడా పెంచి కౌంటర్లను రెండు నుంచి నాలుగుకు పెంచారు. దీంతో 15 రోజుల్లో 22 వేల 752 శ్రీవాణి టికెట్ల విక్రయం ద్వారా 22 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చిలో శ్రీవారి ఆదాయం 118 కోట్లుగా తేల్చారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 81వేల మంది శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆదాయం 4 కోట్ల 35 లక్షలు వచ్చింది. రేపు తిరుమలలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

Exit mobile version