Srisailam EO Lavanna: శ్రీశైలం ఈవో లవన్న మరో వివాదంలో చిక్కుకున్నారు. మల్లన్న దర్శనానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో శివ మాలలో ఉన్న సంగతి మర్చిపోయి కూడా పెద్దిరెడ్డి కాళ్లు మొక్కి స్వామి భక్తి చాటుకున్నారు. ఈవో వ్యవహారశైలిపై శివ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఈవో లవన్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు, వివాదాలు ఈవోపై ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లులలో ఈవో పూర్తిగా విఫలం చెందినట్లు భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా వీఐపీ పాసులు అధిక సంఖ్యలోనూ జారీ చేయడంపై జిల్లా అధికారులు కూడా చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also: