27.7 C
Hyderabad
Saturday, June 10, 2023

15ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన యంగ్ సెన్సేషన్ జైస్వాల్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించిన అతడు 625 పరుగులు చేశాడు. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ చేసిన 615 పరుగుల రికార్డును బద్దలుకొట్టాడు.

అంతేకాకుండా ఓ సీజన్‌లో 600 పరుగులు చేసిన రెండో పిన్న వయస్కుడిగానూ నిలిచాడు. 20 ఏళ్ల 226 రోజులు వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ ఈ ఘనత సాధిస్తే.. 21 ఏళ్ల 142 రోజుల వయసులో జైస్వాల్ ఈ రికార్డు నమోదుచేశాడు. మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడి 625 పరుగులు చేసి రెండో స్థానంలోనూ కొనసాగుతున్నాడు. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 702 పరుగులతో తొలిస్థానంలో ఉన్నాడు.

Latest Articles

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్