32.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

‘ఆకాశ’మంత విజయం.. ముంబై ఇండియన్స్ సొంతం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచులో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ విజృంభించడంతో 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో రోహిత్ సేన క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు గ్రీన్‌(41), సూర్యకుమార్‌ యాదవ్(33) మెరవడంతో 20 ఓవర్లలో 182/8 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన లక్నో ఏ దశలోనూ గెలుపు దిశగా ఆడలేదు.

MI బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ధాటికి 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. మధ్వాల్ కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో 2009లో దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే సరసన చేరాడు. మరోవైపు లక్నో ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ అవ్వడం కూడా ఆ జట్టు అవకాశాలనూ పూర్తిగా దెబ్బతీసింది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఇలా ఏకపక్షంగా ముగిసింది. ఈ నెల 26న జరిగే క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది.

Latest Articles

అదానీ యూనిట్‌లో అంబానీకి వాటా

   అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఒక డీల్‌ కోసం చేతులు కలిపారు. బాయి బాయి అంటున్నారు. వారు దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు చేతులు కలిపారు. ఇలా జరగడం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్