26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

ధోనితోని అట్లుంటది మరి.. ఐపీఎల్ రికార్డు బద్దలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ సూపర్ రికార్డు నమోదుచేసింది. చెపాక్‌ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచును జియో సినిమాలో 2.5కోట్ల మంది వీక్షించారు. ఏప్రిల్ 17న జరిగిన చెన్నై-బెంగళూరు మ్యాచ్‌ను 2.4కోట్ల మంది చూశారు. దీంతో క్వాలిఫయర్ మ్యాచ్ ఈ రికార్డును బద్దలుకొట్టింది. ఈ మేరకు జియో సినిమా తన ట్విటర్‌లో పోస్టు చేసింది. కీలకమైన నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచుల ఆరంభంలోనే రికార్డును బ్రేక్‌ చేశాం. గుజరాత్-చెన్నై మ్యాచ్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారని పేర్కొంది. కాగా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు కలిపి దాదాపు 1300కోట్ల వీడియో వ్యూస్‌ను జియో సినిమా రాబట్టింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుపై చెన్నై గెలిచి ఫైనల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ధోని సేన ఏకంగా పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

Latest Articles

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

స్వతంత్ర వెబ్ డెస్క్: మేషం ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్