38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

టీ20 చరిత్రలోనే అద్భుతమైన మ్యాచ్.. ఏకంగా 12 రికార్డులు

టీ20ల చరిత్రలోనే పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 రికార్డులు నమోదయ్యాయి. అది కూడా ఒకే ఒక్క టీ20 మ్యాచులో. ఏంటి నమ్మడం లేదా ఈ గణాంకాలు చూస్తే మీరే వారెవ్వా అంటారు. సెంచూరియన్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20ఓవర్లకు 258 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్ జాన్సన్ చార్లెస్ మెరుపు ఇన్నింగ్స్ లో బౌండరీల మోత మోగించాడు. కేవలం 39 బంతుల్లోనే విండీస్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదుచేశాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ప్రొటీస్ బ్యాటర్లు మొదటి బంతి నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. డికాక్ 100 పరుగులు, హెండ్రిక్స్ 68 పరుగులతో మెరుపు ఆరంభాన్ని అందించారు. ఎంతలా అంటే మొదటి 10 ఓవర్లలో 149 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేజ్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది. గతంలో 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 245 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఈ మ్యాచులో నమోదైన రికార్డులను ఓసారి పరిశీలిస్తే….

*టీ20 మ్యాచులో అత్యధిక పరుగులు(517)

*ఒకే మ్యాచ్ లో అత్యధికంగా 81 బౌండరీలు నమోదు..

*ఒకే మ్యాచ్ లో రెండు జట్ల వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు

*అత్యధిక పరుగులు చేజింగ్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు

*ఒక్క మ్యాచ్ లో అత్యధికంగా 35 సిక్సర్లు

*వెస్టిండీస్ బ్యాటర్ చార్లెస్ 39 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ

*మొదటి 15 బంతుల్లోనే క్వింటన్ డికాక్ రికార్డు ఫిఫ్టీ

* అత్యంత వేగంగా అర్ధసెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా డికాక్ రికార్డ్‌

*కేవలం మొదటి 6 ఓవర్లలోనే 102 పరుగులు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన సౌతాఫ్రికా

*టీ20 క్రికెట్ చరిత్రలోనే మొదటి 10 ఓవర్లలో 149 పరుగులు చేసిన ప్రొటీస్ బ్యాటర్లు

* అలాగే ఈ మ్యాచ్ లో కేవలం బౌండరీలతోనే 394 పరుగులు నమోదు

Read Also: పరారీ మూవీలో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

Follow us on:   YoutubeInstagram

Latest Articles

జగన్ పై దాడి కేసులో ఇద్దరు అరెస్ట్

    సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గా రావు పై కేసు నమోదైంది. విజయవాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్