Site icon Swatantra Tv

రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించిన స్పీకర్‌

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆయన గురించి సభలో వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌క ళ్యాణ్‌ దగ్గరకు వెళ్లారు రఘురామ. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆయనను అభినందించారు. అనంతరం రఘురామను స్పీకర్‌ చైర్‌ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోపెట్టారు. రఘురామకు సభ్యులు అభినందనలు తెలిపారు.

Exit mobile version