Site icon Swatantra Tv

BREAKING: కాసేపట్లో ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్‌.. భారీ బందోబస్తు

ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విచారణకు హాజరుకాబోతున్నారు. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు చేరుకుంటారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ నుంచి నందినగర్‌ చేరుకున్నారు. నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. నందినగర్ నివాసంలో లీగల్ టీమ్ తో చర్చించారు. అనంతరం బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసుకు బయల్దేరారు. ఆయన వెంట లీగల్ టీమ్ కూడా ఉంది. ఇప్పటికే ఏసీబీ ఆఫీస్‌కి విచారణ బృందం చేరుకుంది. ఏసీబీ ఆఫీస్‌కు డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్‌ చేరుకున్నారు. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దర్యాప్తునకు రావాలంటూ ఈనెల 2న ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. డిసెంబర్‌ 20, 31న హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం..తమ ముందు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈనెల 3న నోటీసులు అందుకున్నట్లు కేటీఆర్‌ సంతకాలు చేశారు.

కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా BRS నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అలాగే 100 మంది బీఆర్‌ఎస్‌ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్వీ నేత మేకల విద్యాసాగర్‌ ను హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు.

Exit mobile version