Site icon Swatantra Tv

ఆరునెలలుగా ఆగని యుద్ధం

   గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ దాడుల పరంపర కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరమైన రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్‌ జరిపిన వేర్వేరు వైమానిక దాడుల్లో మొత్తంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. కువైటీ ఆస్పత్రి దగ్గర జరిగిన దాడిలో భార్యభర్తలు, వారి మూడేళ్ల చిన్నారి చనిపోయారు. మరో దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది రఫాలోనే తలదాచుకుం టున్నారు. అయినా వారిపైనే ఇజ్రాయెల్‌ ప్రతిరోజూ వైమానిక దాడులు చేస్తూ తన ప్రతీకారం తీర్చుకుం టోంది.

ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని వెస్ట్‌బ్యాంక్‌లోని హేబ్రోన్‌ పట్టణ చెక్‌పోస్ట్‌పై కత్తి, గన్‌తో దాడిచేసిన ఇద్దరు పాలస్తీనియన్లను హతమార్చామని ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్, పాలస్తీనియన్లకు సాయం కోసం ఉద్దేశించిన 26 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికా దిగువ సభ తన ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ కిందే పాలస్తీనియన్లకు 9 బిలియన్‌ డాలర్ల మానవతా సాయం అందించను న్నారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరులో ఇప్పటిదాకా 34వేలకు కుపైగా పాలస్తీనియన్లు చనిపోయారు. ఆరునెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఇకనైనా చరమగీతం పాడాలని ప్రపంచదేశాలు తమ వంతుగా దౌత్యమార్గాలను అన్వేషిస్తున్నాయి.

Exit mobile version