Site icon Swatantra Tv

రేవంత్‌ సర్కార్‌పై సింగరేణి కార్మిక సంఘాల నేత రాజిరెడ్డి ఫైర్‌

రేవంత్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. సింగరేణి కార్మికులను అంకెల గారడి, మాటల మాయాజాలంతో అటు యాజమాన్యం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం బురిడీ కొట్టిస్తుందని ఫైర్‌ అయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ బొగ్గు గనులపై కార్మికులతో కలిసి లాభాల వాటాపై చర్చించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల కష్టాన్ని పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ లాభాల వాటాలో.. నికర లాభం నుండి 33 శాతం కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు.

Exit mobile version