శృతి హాసన్…ఇండియన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. మంచి పీక్ లో ఉన్నప్పుడు సడన్ గా మైఖల్ కోర్సలే అని ఫొటోగ్రఫీ హాబీగా ఉండే ఒక బోయ్ ఫ్రెండ్ తో తిరిగి, కెరీర్ ను వదిలేసి, తర్వాత అతనితో తెగతెంపులు చేసుకుని తిరిగి ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈ దశలో తెలుగు సినిమాలో ఏజ్డ్ హీరోలకి కరెక్టుగా సూట్ అవుతున్న శృతిహాసన్ టాప్ హీరోలు అందరి సరసనా నటించింది. అవి కొత్త ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సింహారెడ్డి, ప్రభాస్ తో సలార్ మూడు భారీ చిత్రాలే…
కొత్త ఏడాది బ్లాక్ బస్టర్ హీరోలతో నటించి రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 34 ఏళ్ల శృతి హాసన్…తాజాగా అభిమానులు అందరికీ మళ్లీ ఒక ఝలక్ ఇచ్చింది. అదేమిటంటే మళ్లీ ఒక కొత్త ఫ్రెండ్ తో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటూ ఫొటోలు పెట్టేసింది. ఇంతకీ ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరంటే ‘శాంతను హజారికా’…ఇతను గౌహతి ఆర్ట్ ప్రాజెక్టు సహ వ్యవస్థాపకుడు. అయితే కొత్త సంవత్సరం కొత్త స్నేహితులు, కొత్త ప్రియుడు శాంతనుతో కలిసి ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేసుకుంది. 2023 మొదటి రోజు ఇదే హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారడంతో వైరల్ గా మారింది.
శృతిహాసన్ జీవితంలో విషాదం కూడా ఉంది. ఒకరోజున ముంబైలో ఇంటిలో ఉన్నప్పుడు ఒక అగంతకుడు చొరబడి తన పీక పట్టుకోవడంతో తెలివిగా తప్పించుకుని బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటివన్నీ చూస్తున్న అభిమానులు ఇప్పుడైనా బోయ్ ఫ్రెండ్ తో బోల్తా కొట్టవద్దని సలహాలిస్తూ పోస్టులు పెడుతున్నారు.