Site icon Swatantra Tv

బీఆర్ఎస్ కు షాక్ .. గద్వాల్ ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: గద్వాల ఎమ్మెల్యే  బండ కృష్ణమోహన్ రెడ్డిని  తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా  ప్రకటించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణను  ఎమ్మెల్యేగా  ప్రకటించింది. 2018 ఎన్నికల సమయంలో  తప్పుడు అఫిడవిట్ సమర్పించారని  బండ కృష్ణ మోహన్ రెడ్డిపై   తెలంగాణ హైకోర్టులో  డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు  గురువారం నాడు కీలక తీర్పును వెల్లడించింది.

 

అంతేకాదు  బండ కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 2018 ఎన్నికల్లో  బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై  బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. కృష్ణ మోహన్ రెడ్డి, డీకే అరుణ ల మధ్య బంధుత్వం ఉంది.

Exit mobile version