Site icon Swatantra Tv

చంద్రబాబుకు షాక్.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

చంద్రబాబుపై నమోదైన కేసులో తమ వాదనలు కూడా వినాలని అందులో కోరింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతివ్వాలని కోరింది.

Exit mobile version