Site icon Swatantra Tv

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్‌

  లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాకు మీద షాక్ తగులుతోంది. సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు పార్టీని వీడుతుండగా .. తాజాగా బీఆర్ఎస్‌ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కామ్‌ వంటివి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించు కున్నానని.. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు మూడు రోజుల క్రితమే కావ్య హైదరాబాద్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలోనే బరి నుంచి తప్పుకొంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం చర్చనీ యాంశమైంది. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తా రన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Exit mobile version