Site icon Swatantra Tv

గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని షర్మిల హామీ.! -పాదయాత్రలో కల్లుతాగిన షర్మిల.!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్ షర్మిల పాదయాత్ర 236వ రోజు జనగాం నుంచి ప్రారంభమై.. నెల్లుట్ల, కుందారం, కిస్టగూడెం, చీటురు గ్రామాల మీదుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా లక్ష్మీనారాయణపురం స్టేజ్ వద్ద గీత కార్మికులను షర్మిల కలిశారు. గీత కార్మికుల కోరిక మేరకు వైఎస్‌ షర్మిల కల్లు టేస్ట్ చేశారు.

అలాగే, నెల్లుట్లలో సర్కార్ భూమిలో గుడిసెలు వేసుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న 802 పేద కుటుంబాలు షర్మిలను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి పరిస్థితిని చూసి చలించిన షర్మిళ ఆ గుడిసెలకు 15లక్షలతో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని YSRTP నాయకులను ఆదేశించారు.

Exit mobile version