Site icon Swatantra Tv

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. గత పదేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదాపై .. బీజేపీ మాట మార్చిందని.. ప్రధానిగా మోదీ.. ఏపీకి ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విభజన అంశాలపై మోదీ హామీలను నిలబెట్టుకుంటారని నమ్మకం పోయిందన్నారు. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో టీడీపీ నేతలు ఒకసారి పరిశీలన చేసుకోవాలని షర్మిల తెలిపారు. మోదీ అంటేనే మోసమని.. పదేళ్లుగా ప్రధాని ఏపీకి వెన్నుపోటు తప్ప.. అభివృద్ధికి సహకరించింది లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగన్ హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదని.. ఇప్పుడైనా చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని వైఎస్ షర్మిల తెలిపారు.

Exit mobile version