Site icon Swatantra Tv

షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక మలుపు

  మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజా భవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్‌ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే జూబ్లీహిల్స్‌లో మరో ప్రమాదం వ్యవహరం చేసినట్లు బయటపడింది. ఆ కేసులోనూ అప్పుడు కేసును దర్యాప్తు చేసిన పలువురు అధికారుల పై సస్పెన్షన్ వేటు వేశారు.

  రాహిల్‌ను కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్‌ రూం ఎస్సై, అప్పటి జూబ్లీహిల్స్ సెక్టార్ ఎస్సై చంద్రశేఖర్‌ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సుదర్శన్, చీఫ్ ఆఫీస్ ఐటీసెల్ డీఎస్పీ రాజ శేఖర్‌రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజా రాహిల్స్ ఏసీపీగా, రాజశేఖర్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధన్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌ను విధుల నుంచి తొలగించగా, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ప్రక్షాళన చేసి అక్కడ పని చేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు అధికారుల వాగ్మూలాన్ని సైతం పోలీసు లు రికార్డు చేశారు. ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు ఆఫ్రాన్ స్టేట్మెంట్‌ను న్యాయ మూర్తి ఎదుట రికార్డు చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం.

    2022 మార్చి 17న జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచా రణలో రాహిల్‌ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆఫ్రాన్‌ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. స్టీరింగ్ పై వేలిముద్రలు ఆఫ్రాన్‌ వేలి ముద్రలతో సరిపోలా యని పోలీసులు తెలిపారు. కానీ ఇటీవల రాహిల్ తన కారుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతడిని తప్పించేందుకు సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాతకేసుపై అనుమానాలు మొదలయ్యాయి.పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేకదృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మహా రాష్ట్ర నుంచి బాధితురాళ్లను తీసుకొచ్చి వాంగ్మూలాలు సేకరించారు. కేసులో రాజీకుదుర్చుకుని వైద్య చికిత్స కోసం 2లక్షలను బాధితురాళ్లకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రాహిల్ స్వయం గా వాహనం నడిపినా కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతడు తప్పించుకునేం దుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పటి అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో నమోదైన కేసు వ్యవ హరంలో తనను అరెస్ట్ చేయొద్దని షకీల్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది.

Exit mobile version