Site icon Swatantra Tv

యనమల సోదరుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు..?

    తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతుందా..? ఒకప్పుడు అన్న యనమల రామకృష్ణుడు మాట జవదాటని యనమల కృష్ణుడు అన్నకు దూరంగా ఉంటున్నారా? కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరంగా పెట్టడమే వారు మధ్య విభేదాలకు కారణం అయ్యాయా? అసలు తుని టీడీపీలో ఏం జరుగుతోంది..?

కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గం టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది. తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. యనమల రామకృ ష్ణుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటకీ.. నియోజవర్గ బాధ్యతలు సోదరుడు యనమల కృష్ణుడు చూసుకు నేవారు. అయితే 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ఓటమిపాలైనప్పటి నుంచి యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఇక రానున్న ఎన్నికల్లో కూడా యనమల కృష్ణుడికి టికెట్ దక్కలేదు. పైగా టికెట్ విషయంలో విభేదాలు రావడంతో వారిద్దరూ కొంతకాలంగా ఎడ మొహం పెడమొహంగా ఉంటున్నట్లు సమాచారం.

       ఈసారి ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కు అభ్యర్థి గా అవకాశం కల్పించారు. అయితే కృష్ణుడు తనకు ఈసారి కూడా అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. దీంతో అధిష్టానం కుదర దని చెప్పడంతో యనమల కృష్ణుడు మిన్నకుండి పోయారు. అయితే యనమల కృష్ణుడుని చంద్రబాబు పిలిపించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. తర్వాత కృష్ణుడు, కుమార్తె దివ్య గ్రామాలు తిరుగుతూ టిడిపి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారాలు నిర్వహించారు. యనమల దివ్య విజయం కోసం అన్నదమ్ములు ఇద్దరు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే యనమల కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరం పెడుతూ వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణుడికి అనుచరుడుగా ఉన్న శేషగిరిని దివ్య దూరంగా పెట్టడంతో యన మల కృష్ణుడు మళ్లీ అసంతృప్తి వెలిబుచ్చినట్లు సమాచారం. అంతేకాదు తన వర్గాన్ని యనమల రామ కృష్ణుడు కూడా పక్కన పెట్టారని యనవమల కృష్ణుడు వైసీపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడంలేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించారు యనమల కృష్ణుడు. ఇక ఈ మధ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే ఇవేవీ పట్టిం చుకోకుండా ప్రచారంలో ముందుకువెళ్తున్నారు యనమల దివ్య. మొత్తానికి యనమల సోదరుల మధ్య విభే దాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ విభేదాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.

Exit mobile version