Site icon Swatantra Tv

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

సొంత నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు మల్లన్న. కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా, లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్తానని, వడ్డీతో సహా చెల్లిస్తానని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు మల్లన్న. అయితే,.. ఈ వ్యాఖ్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో మల్లన్న ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇకపోతే బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా వస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా చర్చకు దారి తీసింది. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించిన బీసీల సమర శంఖారావంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లన్న. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీల అండదండలతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోనని.. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version